హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో అక్రమ గ్రానైట్ మైనింగ్

CTR: చిత్తూరు గ్రామీణ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా రోజూ లక్షల విలువైన గ్రానైట్ సంపదను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ దందాల వెనుక ఓ ముఖ్య ప్రజాప్రతినిధి పీఏ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్‌పై మైనింగ్ శాఖల అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిర్వాహకుల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి.