హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లె వన్‌టౌన్‌ సీఐగా మోహన్‌కుమార్‌

అన్నమయ్య: మదనపల్లె వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నూతన సీఐగా మోహన్‌కుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డివిజన్‌లో సీఐల బదిలీల్లో భాగంగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని సీఐ తెలిపారు. పోలీస్‌ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.