హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేశ్‌ నిమజ్జనంలో వివాదం

GNTR: తాడేపల్లి(M) పెనుమాకలో ఆదివారం రాత్రి గణేశ్ నిమజ్జన వేళ వివాదం చోటుచేసుకుంది. పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఓపాట విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. పరిస్థితి ఘర్షణకు దారితీసే స్థాయికి చేరింది. పోలీసుల తీరుపై ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ గణేశ్‌ విగ్రహం ఊరేగింపులో కావాలనే వివాదం సృష్టిస్తున్నారని కమిటీ సభ్యులు ఆరోపించారు.