హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భార్య, కుమారుడిపై కత్తితో దాడి

GNTR: పెదనందిపాడు మండలం ఉప్పలపాడులో ఆదివారం రాత్రి కుటుంబ కలహాలతో ఘటన చోటుచేసుకుంది. భార్య, కుమారుడిపై భర్త జాన్‌ సైదా కత్తితో దాడి చేసినట్లు సమాచారం. గాయపడిన ఇద్దరినీ 108 సిబ్బంది చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.