హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డుపై అడ్డంగా పేడ.. పలువురికి గాయాలు

GNTR: చేబ్రోలు-మంచాల మధ్య ఉన్న వంతెన సమీపంలో దుండగులు రోడ్డుపై పేడ పడేసి వెళ్లారు. ఆదివారం వాన పడుతున్న సమయంలో లారీలో వచ్చి ఎరువు పోశారు. రోడ్డుపై ఉన్న పేడతో ద్విచక్రవాహనాలు జారిపడి 8 మందికి గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే కార్మికులతో రోడ్డును శుభ్రం చేయించారు. వాహనదారులను ఇబ్బందిపెట్టేందుకే ఇలా చేశారని పోలీసులు భావిస్తున్నారు.