హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురం నూతన ఎస్పీ నేపథ్యం ఇదే!

ప్రకాశం: మార్కాపురం జిల్లా నూతన ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా నియమితులయ్యారు. 2020 బ్యాచ్‌కు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ IPS అధికారి. రాజస్థాన్‌కు చెందిన ఈయన ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. గతంలో చింతూరు ఏఎస్పీగా, గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా విధులు నిర్వర్తించారు. నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్లలో అనుభవం ఉన్న అధికారిగా పేరుంది.