హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజకుమారి

నంద్యాల జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజకుమారిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత జడ్పీ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. దీంతో 25వ తేదీ నుంచి జిల్లా పరిషత్ పరిపాలనా బాధ్యతలను కలెక్టర్ స్వీకరించనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.