KDP: గండికోట రిజర్వాయర్‌లో సోమవారం నాటికి నీటి మట్టం 685.072 అడుగులుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.572 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 4,900 క్యూసెక్కులు ఉండగా, బయటకు వెళ్లే అవుట్‌ఫ్లో 100 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గండికోట నీటిమట్టం వివరాలు..!


