హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పారిపోవడం మానేసి అక్కడే పడుకున్నాడు

NLR: జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెంలో తాళం వేసిన ఇంట్లో ఓ దొంగ చొరబడి దొంగతనం చేసిన వస్తువులన్నీ మూటగట్టుకున్నాడు. కానీ, అక్కడి నుంచి పారిపోకుండా, ఆ ఇంట్లోనే రెండ్రోజులు ఫ్యాన్, లైట్ వేసుకుని హాయిగా నిద్రపోయాడు. ఆదివారం ఉదయం ఇంటికొచ్చిన యజమానులు మంచంపై హాయిగా పడుకున్న దొంగను చూసి నివ్వెరపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.