హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రితో ప్రత్యేక అనుభవం ఉంది: సుమన్

E.G: రాజమండ్రితో తనకు నాలుగు దశాబ్దాలుగా ప్రత్యేక అనుబంధం ఉందని సినీ నటుడు సుమన్ తెలిపారు. బీజేపీ నేత నర్సపల్లి హారిక ఇంట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1981-82లో రంపచోడవరం, రాజమండ్రిలో తొలిసారి 'గూడచారి 116' సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు గుర్తుచేశారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా రాష్ట్రంలో షూటింగ్లను ప్రోత్సహిస్తున్నారు.