హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్ర కాలువలో మహిళ మృతదేహం లభ్యం

KKD: సామర్లకోట ఎల్సీ గేట్ సమీపంలోని గోదావరి ఎర్ర కాలువలో మహిళ మృతదేహం లభ్యమైనట్లు సీఐ కృష్ణ భగవాన్ ఆదివారం తెలిపారు. స్థానికుల సమాచారంతో వీఆర్వో రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహానికి సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులు లేదా తెలిసిన వ్యక్తులు సామర్లకోట పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు