హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మునిగిన మత్స్యకారుల బోటు.. తప్పిన ప్రమాదం

కోనసీమ: ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగలో ఆదివారం మత్స్యకారుల బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. భైరవపాలెం గ్రామానికి చెందిన చింత శ్రీను బోటుపై తొమ్మిది మంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. సముద్రంలో గాలి వేగంగా వీయడంతో బోటు మునిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు మరో బోటు సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు.