హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతర్వేదిలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

కోనసీమ: అంతర్వేది నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భాద్రపద నవమి రాత్రి నుంచి దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. అర్చకులు దీక్షాధారణ చేసి మంగళవాయిద్యాల నడుమ మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. విష్వక్సేన పూజ, పుణ్యహవాచనం నిర్వహించారు.