హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కోయిలకుంట్లలో మంత్రి బీసీ పర్యటన

NDL: నేడు కోయిలకుంట్ల పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళిమోహన్ రెడ్డి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రికి తెలపాలని మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు.