అన్నమయ్య: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటికి శనివారం రాత్రి కురిసిన వర్షపు నీరు తోడవడంతో ఆదినిమ్మాయపల్లె ఆనకట్టలో జలకళ సంతరించుకుంది. రాజోలి ఆనకట్ట నుంచి ప్రవాహం నిలిచిపోయినా వర్షపు నీటితో ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి ఆనకట్ట నుంచి 1,100 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్లు ఏఈ గంగిరెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు జలకళ


