హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండికోటకు పెరుగుతున్న వరదనీరు

KDP: కొండాపురం మండల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు 1,000 క్యూసెక్కులకు పైగా వరదనీరు గండికోట ప్రాజెక్టులోకి చేరుతోంది. జిల్లాలో అత్యధికంగా కొండాపురంలో 126.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు జలవనరులశాఖ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. అవుకు జలాశయం నుంచి 2,500 క్యూసెక్కుల కృష్ణా జలాలు కూడా గండికోటలోకి వస్తున్నాయి. ప్రస్తుతం 15.30 టీఎంసీల నీరునిల్వ ఉందన్నారు.