హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ రోగులకు ఉచిత జన్యు పరీక్షలు

GNTR: గుంటూరు GGH నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో క్యాన్సర్ రోగులకు ఉచితంగా అత్యాధునిక జన్యు పరీక్షలు అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ల్యాబ్ సిద్ధమైంది. రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్లలో జన్యు మార్పులను గుర్తించే ఈ సేవలను సెప్టెంబర్ 22న మంత్రి సత్యకుమార్ ప్రారంభించనున్నారు. అమరావతిలో పూర్తి స్థాయి జన్యు కేంద్రం ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి.