హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వన్ టౌన్ సీఐపై వేటు

ATP: అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లుపై వేటు పడింది. అవినీతి ఆరోపణల కథనాలపై ఎస్పీ జగదీశ్ విచారణకు ఆదేశించారు. ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో సీఐని వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా వీఆర్‌లో ఉన్న సీఐ కరుణాకర్‌ను అనంతపురం వన్ టౌన్‌కు నియమించినట్లు అధికారులు తెలిపారు.