హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ ధరుకు వినాయక లడ్డూ వేలం

SS: ధర్మవరం పట్టణంలోని కొత్తపేట శ్రీ వరసిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. ఈ వేలం పాటలో సందా రవీంద్ర పాల్గొని రూ.1,65,000 పలికి లడ్డూను గెలుపొందారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, స్థానిక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.