హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణకాంతుల్లో శ్రీ వేంకటేశ్వరుని దివ్య విహారం

TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం సాయంత్రం స్వర్ణకాంతుల్లో భక్తుల మధ్య శ్రీ మలయప్పస్వామివారు వైభవంగా విహరించారు. గోవిందనామస్మరణతో తిరుమాడ వీధులు మార్మోగగా, భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించారు. స్వర్ణకాంతులతో మెరిసిన రథంపై స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు దర్శించుకున్నారు.