హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తా: అశోక్ రెడ్డి

TPT: రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఓజిలి తహసీల్దార్ మిట్టపల్లి అశోక్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు సమస్యల పరిష్కారానికి పాటుపడతానని పేర్కొన్నారు. ఈ ఎన్నిక పట్ల రెవెన్యూ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది.