కోనసీమ: అయినవిల్లి మండలం క్రాపపాలెం గ్రామంలోని నూతన శ్రీ రామాలయ అభివృద్ధికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ మంజూరు చేసిన రూ.10 లక్షల చెక్కును ఆదివారం పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి నిధులను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
క్రాపపాలెం ఆలయానికి రూ.10 లక్షలు చెక్కు అందజేత


