హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలో పడి నాలుగేళ్ల చిన్నారి గల్లంతు..!

W.G: తాడేపల్లిగూడెంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి నాలుగేళ్ల బాలుడు గల్లంతయ్యాడు. యాగార్లపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద తల్లి దుస్తులు ఉతుకుతుండగా, ఆడుకుంటూ బాలుడు ఏలూరు కాలువలో పడిపోయాడు. తల్లి కేకలతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది బోటు సాయంతో కాలువలో గాలింపు చర్యలు ప్రారంభించారు.