హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆశ్రమానికి నిత్యావసర సరుకుల వితరణ

అన్నమయ్య: చిట్వేల్ మండల పరిధిలోని చిట్వేల్ -రాపూరు రోడ్డు తిమ్మాయపాలెం క్రాస్‌ వద్ద శ్రీశ్రీశ్రీ దస్తగిరి నారాయణ తపోవన భయాంజనేయ స్వామి ఆశ్రమంలో పెద్దల భోజన సౌకర్యం కోసం రూ. 5 వేల విలువైన బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలు అందజేశారు. కీర్తిశేషులు పగడాల సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ దాతలకు ఆశీస్సులు తెలిపారు.