హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సును ఢీకొన్న టిప్పర్.. తప్పిన ప్రమాదం

కోనసీమ: ముమ్మిడివరం మండలం కొమానపల్లి వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టడంతో బస్సు పాక్షికంగా దెబ్బతింది. కాకినాడ నుంచి అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో బస్సు రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు చిన్నచిన్న గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.