హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పదో తరగతి ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు అందజేత

కోనసీమ: వాడపాలెం హైస్కూల్‌లో చదివి 2026 పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన పది మంది విద్యార్థులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం స్కాలర్‌షిప్‌ చెక్కులు అందజేశారు. వాడపాలెం బండారు పేరమ్మ స్వామివారి అన్నదాన సత్రం ఆధ్వర్యంలో సమకూర్చిన రూ.లక్షను ఒక్కో విద్యార్థికి రూ.10 వేల చొప్పున అందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.