హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూపిలిపాలెం బీచ్‌లో భక్తుల సందడి

TPT: వాకాడు మండలం తూపిలిపాలెం బీచ్‌లో ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. సెలవు దినం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. సముద్ర తీరంలో విగ్రహాలను ఉత్సాహంగా నిమజ్జనం చేస్తూ భక్తులు సందడి చేశారు. భక్తుల రద్దీ, భారీ జనసందోహం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిశీలిస్తున్నారు.