హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోకేష్ పర్యటనకు భద్రతా ఏర్పాట్లు పరిశీలన

ATP: ఈ నెల 22న ఎన్టీఆర్, పరిటాల రవి కాంస్య విగ్రహాల ఆవిష్కరణకు మంత్రి నారా లోకేష్ హాజరుకానున్న నేపథ్యంలో రాప్తాడులో ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. జిల్లా ఎస్పీ జగదీష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి సభా ప్రాంగణం, సమావేశ ప్రాంతం, భోజనాలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు.