హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పాడ సముద్ర తీరంలో బోటు బోల్తా..!

కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో ఓ మత్స్యకార బోటు బోల్తాపడి పూర్తిగా ధ్వంసమైంది. మైలపల్లి మసేనకు చెందిన బోటు సముద్రంలో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో బోటు తీవ్రంగా దెబ్బతిని పనికిరాకుండా పోయింది. బోటు విలువతో పాటు ఇతర సామగ్రితో కలిపి సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.