సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి రెవెన్యూ భవన్‌లో రేపు 21న జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ వినతులు స్వీకరిస్తామన్నారు. ప్రజలు నేరుగా రాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు రెవెన్యూ భవన్‌లో PGRS'


