హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆకట్టుకుంటున్న కోన జలపాతం

అనంతపురం జిల్లాలో కురుస్తున్న జోరువానలతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడులోని కోన జలపాతం వర్షాలతో కొత్త అందాలను సంతరించుకుంది. సుమారు 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలధారలు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. జలపాతం అందాలను వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు.