KRNL: కర్నూలు నగరంలో ఈ నెల 22న సుమారు 1,500 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వినాయక్ ఘాట్, HNSS నన్నూరు, ఉలిందకొండ వద్ద నిమజ్జనం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ నిమజ్జనాలకు భారీ బందోబస్తు


