హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరిలో ఘనంగా గణేష్ శోభాయాత్ర

సత్యసాయి: కదిరి పట్టణంలో గణేష్ శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గణనాథుని ఆశీస్సులతో కదిరి ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.