హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత కంటి వైద్య శిబిరం..!

NTR: రెడ్డిగూడెంలో MNR ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు హాజరయ్యారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కంటి వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ శిబిరం కొనసాగింది. మొత్తం 78 మందికి కంటి పరీక్షలు చేయగా, 9 మందిని శుక్లము ఆపరేషన్‌కు ఎంపిక చేసి ఆసుపత్రికి తరలించారు.