హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కరువు ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలి'

ఏలూరు: జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నందున ప్రభుత్వం తక్షణమే కరువు ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్టా భాస్కరరావు, కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లోటు వర్షపాతంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలకు నీరు అందడం లేదన్నారు. పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసి, ఉపాధి పనులు కల్పించాలని కోరారు.