హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హనుమంత వాహనం పై శ్రీ మలయప్ప స్వామి

TPT: హనుమంత వాహనంపై శ్రీమలయప్ప తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీమలయప్పస్వామి కోదండరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రామభక్తుడైన హనుమంతుడిపై స్వామివారి ఉత్సవమూర్తిని అధిష్ఠింపజేసి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.