హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అంబారుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..!

NTR: నందిగామ శివారు అంబారుపేట గ్రామంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్యమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో రోడ్డు దాటుతున్న వల్లపు దాసు కవిత (45) అనే మహిళను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కవిత తీవ్రంగా గాయపడ్డారు. ఆమె స్థానికంగా ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు.