హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మళ్లీ ఉప్పొంగిన కోన జలపాతం!

NDL: కౌలుపల్లి సమీపంలోని కోన జలపాతం మళ్లీ ఉప్పొంగింది. ఏటా వర్షాకాలంలో పర్యాటకులతో కళకళలాడే ఈ ప్రాంతం. ఈ ఏడాది వర్షాలు లేక వెలవెలబోయింది. ఆదివారం కురిసిన కుండపోత వర్షంతో ఎగువ ప్రాంతం నుంచి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో జలపాతం అందాలు రెట్టింపయ్యాయి. జలపాతాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కోన వద్ద సందడి వాతావరణం నెలకొంది.