హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వీఆర్ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి'

సత్యసాయి: రాష్ట్రంలోని వీఆర్ఏల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ డిమాండ్ చేశారు. పుట్టపర్తి ఎమ్మార్వో కార్యాలయం వద్ద నాలుగో రోజు చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడారు. పేస్కేల్ అమలు, నామినీల నియామకం, పదోన్నతులు, కారుణ్య నియామకాల డిమాండ్లు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు.