హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలేరమ్మ జాతరలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

NLR: మర్రిపాడు మండలంలోని చాబోలు గ్రామంలో ఆదివారం పోలేరమ్మ జాతరను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాప్‌ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విచ్చేశారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ ఆలయానికి చేరుకున్న బైరెడ్డికి స్థానిక నాయకులు, గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.