హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహం..!

కృష్ణా: నందిగామ పట్టణంలో తంగిరాల సౌమ్య, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, కలశా ఫైన్ జ్యువెల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నందిగామ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వ్యాపార రంగాల ప్రోత్సాహానికి కృషి చేస్తోందని తెలిపారు. కొత్త వ్యాపారాలకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.