హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే సౌమ్య గణపతి పూజలు..!

NTR: ఆదివారం నందిగామ పట్టణంలోని వినాయక పందిళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. కూటమి నేతలతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని గణనాథుడిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.ప్రజలందరూ ఐకమత్యంతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.