హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు గురజాడ జయంతి ఉత్సవాలు: కలెక్టర్

VZM: మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి ఉత్సవాలను సెప్టెంబరు 21న రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. గురజాడ స్వగృహంలో ఉదయం 9 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు.