హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధి హామీపై కూలీలకు అవగాహన

సత్యసాయి: లేపాక్షి మండలంలోని బిసలమనేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంపై కూలీలకు ఫీల్డ్ అసిస్టెంట్ గోవిందప్ప అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు పొందేందుకు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని వివరించారు. ఉపాధి హామీ పథకం అందుబాటులో ఉన్నప్పుడు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు.