అన్నమయ్య: పెద్దతిప్పసముద్రం మండలంలో మొత్తం ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లకు 1,433 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అందులో వృద్ధులు- 773, అంగవైకల్యం- 250, డప్పు కళాకారులు- 98, సింగిల్ ఉమెన్- 06, గీతకార్మికులు- 32, వితంతువులు 274 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కాగా కొత్త పింఛన్ల దరఖాస్తు గడువు ముగిసింది.
ఆంధ్రప్రదేశ్
పీటీఎంలో పింఛన్లకు దరఖాస్తుల వెల్లువ..!


