హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెలవు రోజులో వీఆర్ఏల నిరసన కార్యక్రమం

ATP: గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం సెలవు దినం కూడా వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అర్హులైన వీఆర్ఏలకు పర్మినెంట్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.