హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వశిష్ట వారధి నిర్మాణానికి అడ్డంకులు తొలగింపు

కోనసీమ: నరసాపురం–సఖినేటిపల్లి రేవుల మధ్య వశిష్ట వారధి నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. రూ. 580 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, నలుగురు కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేశారు. రెండు జిల్లాల్లో భూసేకరణ, రైతులకు పరిహారం చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. వారధితో పాటు సీతారాంపురం నుంచి గుడిమెళ్లలంక వరకు రోడ్డు వేయనున్నారు.