హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ'

NZB: సిరికొండ మండలం జగదాంబ తండాకి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తోందన్నారు. లబ్ధిదారుల సొంతింటి కల నెరవేరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.