NTR: నందిగామలోని ఎస్.వి.ఆర్ రెసిడెన్షియల్ ప్రాంగణంలో నిన్న రాత్రి వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా 5 కేజీల వినాయక లడ్డూ వేలంలో రూ. 90 వేలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. భక్తులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపు, నృత్యాలతో పరిసరాలు సందడిగా మారగా, వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో వినాయక లడ్డూకు భారీ ధర..!


