హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్‌లో మంత్రి కింజరాపు

SKLM: కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.